Select Location
All Locations
State
Region
City / District
అడుగు పెట్టిన గూగుల్‌.. విశాఖ సిగలో ఏఐ వెలుగుల్‌!!

అడుగు పెట్టిన గూగుల్‌.. విశాఖ సిగలో ఏఐ వెలుగుల్‌!!

ఒక గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడివివరం ప్రాంతాల్లో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు 601 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలున్న గూగుల్‌ సంస్థకు విశాఖ ఒక మంచి గమ్యస్థానంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలోనే అందమైన, అద్భుతమైన నగరాల్లో విశాఖ ఒకటి. ఒక వైపు సముద్రం, మరొకవైపు తూర్పు కనుమలు, విస్తారమైన అడవులున్నాయి. ఎంతో సహకారం, సానుకూల ఆలోచనలు కలిగి ఉన్న నగరం విశాఖ. ‘ఏఐ డేటా’కు గేట్‌వేగా విశాఖ..

అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా పురోగమిస్తాయి. విశాఖకు రాయపూర్, భువనేశ్వర్‌ వంటి నగరాలతో అనుసంధానం పెరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు, కంపెనీలు తీసుకురావడానికి అత్యుత్తమ విధానాలను అమలు చేస్తోంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, సంధ్యారాణి, రాష్ట్ర తెదేపా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీటీఎస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News