Select Location
All Locations
State
Region
City / District
ప్రమాదంలో కేబీఆర్ పార్క్ భవిష్యత్తు.. H సిటీ పనులతో పర్యావరణానికి ముప్పు..!

ప్రమాదంలో కేబీఆర్ పార్క్ భవిష్యత్తు.. H సిటీ పనులతో పర్యావరణానికి ముప్పు..!

పద్మారావునగర్, వెలుగు: నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్ భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడిందని, హెచ్​-సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ. 930 కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్​పాసుల వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్​ను అడ్వకేట్​రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు. అభివృద్ధి పేరిట ఏకంగా 1900కు పైగా భారీ వృక్షాలను నరికివేస్తున్నారని, నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటకుండానే పనులు మొదలుపెట్టడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు.

కాంక్రీట్ నిర్మాణాల వల్ల పార్కులోని జీవవైవిధ్యం దెబ్బతినడమే కాకుండా, చిరాన్ కుంట చెరువు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. కేసు నమోదు చేయడమే కాకుండా, దీనిపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు ఆదేశాలు జారీ చేసింది.


V6 News 42 minutes ago
Home Flash News