Select Location
All Locations
State
Region
City / District
Prakash Raj | ‘బేటీ బచావో’ వదిలేసి ‘బేటా బచావో’ ఏంటి?.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన నటుడు ప్రకాష్ రాజ్

Prakash Raj | ‘బేటీ బచావో’ వదిలేసి ‘బేటా బచావో’ ఏంటి?.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన నటుడు ప్రకాష్ రాజ్

Prakash Raj | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఎక్స్ వేదికగా నేరుగా ప్రశ్నలు సంధించాడు.

తన ట్వీట్‌లో “బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు?” అంటూ ప్ర‌శ్నించిన ప్రకాష్ రాజ్.. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బేటీ బచావో’ నినాదాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ‘బేటా బచావో’ (కొడుకును రక్షించడం) అనే ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో #justasking అనే హాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ, ప్రభుత్వం నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తోందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.


Smacy News 54 minutes ago
Home Flash News