బాక్సాఫీస్ వద్ద జార్జ్‌కుట్టి మైండ్ గేమ్.. 'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత.. బాలీవుడ్‌లో వేరే లెవెల్ ప్లాన్!
ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఏది అంటే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే పేరు ‘దృశ్యం’. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'దృశ్యం 3' (Drishyam 3). ఈ మూవీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మే 21, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ప్లాన్ వేశాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పీక్స్‌కు చేరింది. థియేటర్లలోకి రావడానికి ఇంకా మరో 10 రోజులు ఉన్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'దృశ్యం 3' వరల్డ్ వైడ్ అడ్వాన్స్ సేల్స్ అప్పుడే రూ. 5.20 కోట్లు దాటాయి. కేవలం ఓవర్సీస్‌లోనే సుమారు 320K డాలర్ల మార్కును టచ్ చేసి ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ చూస్తుంటే మలయాళ చిత్ర పరిశ్రమలో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఖాయమని అంచనా వేస్తున్నారు.