ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉపాధి ఈజీ అవుతుంది: టామ్ కామ్ సమావేశంలో మంత్రి వివేక్
ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉపాధి ఈజీ అవుతుందని అన్నారు మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. జర్మనీలో ఉద్యోగాల కోసం ఎన్నికైన అభ్యర్థులకు జర్మన్ భాష ట్రైయినింగ్ పూర్తయిన సందర్భంగా..టూరిజం ప్లాజాలో టామ్ కామ్ సమావేశం ఏర్పాటు చేశారు. 2026 మే 12న జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు వివేక్.
ఈ సందర్భంగా ట్రైనింగ్ పూర్తయిన విద్యార్థులతో మంత్రి ఇంటరాక్షన్ అయ్యారు. విద్యార్థుల డౌట్లు క్లారిఫై చేశారు. జర్మనీలో ఉద్యోగాలు చేయలంటే అక్కడి భాష రావాలని అన్నారు. జర్మనీ వెళ్లే ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ అయితే మిగతా వారికి అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉపాధి ఈజీ అవుతుందని.. లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఫ్యాషన్ అభ్యర్థులకు ఉంటేనే అది సాధ్యమని అన్నారు. తాను తమిళనాడ వెళ్లిన సమయంలో భాష రాక ఇబ్బంది పడ్డానని చెప్పారు.
సినిమాలు చూడటం ద్వారానే భాష నేర్చుకోవడం ఈజీ అని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. తమిళనాడులో విజయ్ గెలవడం ఎవ్వరూ ఊహించలేదన్నారు. కొత్త వ్యూహాలతో ఎన్నికల ప్రచారం చేశారని.. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలతో జనాలకు ఈజీగా రీచ్ అయ్యారని తెలిపారు.