LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీని పొందేందుకు డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు ప్రతి ఏటా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తాము వాడుతున్న గ్యాస్ కంపెనీ (ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం) మొబైల్ యాప్ ద్వారా లేదా నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లి తమ ఆధార్ ధ్రువీకరణను ఉచితంగా చేసుకోవచ్చు. సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పించినట్లు తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్
కేంద్ర ప్రభుత్వం ఏడాదికి గరిష్ఠంగా తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీని అందిస్తోంది. అయితే, 8, 9 రీఫిల్‌కు సంబంధించిన సబ్సిడీని పొందాలంటే బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి చేశాయి. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటే నిలిపివేసిన సబ్సిడీ సొమ్ము తిరిగి చెల్లిస్తారు. లేనిపక్షంలో ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. ఈ-కేవైసీ పూర్తి చేయకపోయినా గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని, కానీ సబ్సిడీ మాత్రం రాదని అధికారులు వివరించారు.
గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి ఉన్న అవకాశాలు మొబైల్ యాప్: వినియోగదారులు తాము వాడుతున్న గ్యాస్ కంపెనీ (ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ లేదా భారత్ పెట్రోలియం) అధికారిక మొబైల్ యాప్ ద్వారా స్వయంగా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు: నేరుగా మీ ఎల్పీజీకి సంబంధిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. డెలివరీ బాయ్ ద్వారా: సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.
ఉచిత సేవ: ఈ ప్రక్రియ అంతా పూర్తిగా ఉచితం కాగా, వినియోగదారులు ఎలాంటి ఫీజు, నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్రం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కనెక్షన్‌పై గరిష్ఠంగా 9 సిలిండర్ల వరకు రాయితీని అందిస్తుంది. అయితే, సాధారణ వినియోగదారుల కంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ఈ రాయితీ ఎక్కువగా అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై 300 రాయితీని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. నేరుగా వినియోగదారుల ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. వార్షిక ఆదాయం ₹10 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ వర్తించదని కేంద్రం తెలిపింది.