Select Location
All Locations
State
Region
City / District
వడ్ల కొనుగోళ్లపై రాజకీయాలా?..మండిపడ్డ ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి

వడ్ల కొనుగోళ్లపై రాజకీయాలా?..మండిపడ్డ ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​లో అంచనాలకు మించి వడ్లు, మొక్కజొన్న దిగుబడులు రాగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కలెక్టరేట్​లో రైస్​మిల్లర్లు, ట్రాన్స్​పోర్ట్​కాంట్రాక్టర్లతో మీటింగ్​నిర్వహించారు. పంటను కొన్న తర్వాత త్వరగా మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

కొనుగోలు సెంటర్లలో కాంటా పెట్టిన వడ్ల సంచులను మిల్లులకు ట్రాన్స్​పోర్ట్​ చేసే విషయంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే కేసులు పెడతామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. బాల్కొండ సెక్టార్​లో లారీలు సమకూర్చక రైతులను ఇబ్బందిపెట్టిన కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేయిస్తామన్నారు. ప్రతి సెంటర్​కు అవసరమైన లారీలను సమకూర్చాల్సిన బాధ్యత కాంట్రాక్టర్​దేనన్నారు. సమావేశంలో కార్పొరేషన్​చైర్మన్లు తాహెర్​, మోహన్​రెడ్డి, అడిషనల్ కలెక్టర్​కిరణ్​కుమార్, మార్కెట్​చైర్మన్​గంగారెడ్డి, డీఎస్​వో శ్రీకాంత్​రెడ్డి, డీఎం ప్రవీణ్​ తదితరులు ఉన్నారు.


V6 News 30 minutes ago
Home Flash News