Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తన కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోద కావడంతో బండి సంజయ్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి అయి ఉండి నా కుటుంబం జోలికి వచ్చిన వారి అంతు చూస్తా అంటున్నాడు. ఎవరి అంతు చూస్తావు బండి సంజయ్? అని ప్రశ్నించారు.
గతంలో నీ కొడుకు పబ్బులు, క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడే బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాకపోయేదన్నారు. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర మహిళా మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం బండి భగీరథ్‌ని అరెస్ట్ చేసి తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలన్నారు.