Select Location
All Locations
State
Region
City / District
Ram Charan: ‘పెద్ది’ రిలీజ్ మధ్య రిస్ట్ బ్యాండేజ్‌తో రామ్ చరణ్.. అసలు గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?

Ram Charan: ‘పెద్ది’ రిలీజ్ మధ్య రిస్ట్ బ్యాండేజ్‌తో రామ్ చరణ్.. అసలు గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబైకి వెళ్లిన చరణ్ కొత్త స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిమ్ సెలూన్‌కు రామ్ చరణ్ వెళ్లడంతో ఫోటోలు వైరల్గా మారాయి. అయితే అందరి చూపు ఆయన కుడి చేతి మణికట్టుపై ఉన్న సపోర్ట్ బ్రేస్‌పైనే పడింది. చరణ్ కుడి చేతికి రిస్ట్ బ్యాండేజ్ (సపోర్ట్‌ బ్రేస్‌) ధరించి కనిపించడంతో మెగా ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది.

అయితే, పెద్ది షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ సమయంలో చిన్నపాటి మణికట్టు గాయం అయినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు, ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ముందు జాగ్రత్తగా బ్యాండేజ్ ధరించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిన్నపాటి గాయం వల్ల పెద్ది షెడ్యూల్స్‌పై ఎలాంటి ప్రభావం లేదని టాక్.

మే 18న జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి చరణ్ క్యూరియాసిటీతో ఉన్నట్లు పెద్ది మేకర్స్ చెబుతూ వస్తున్నారు. గేమ్ ఛేంజర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత, సాలిడ్ కంటెంట్తో వస్తుండటంతో చరణ్ సైతం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ వచ్చాక పెద్ది కాన్సెప్ట్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


V6 News 1 hour ago
Home Flash News