Select Location
All Locations
State
Region
City / District
హార్ముజ్ దాటి ఇండియాకు చేరిన మరో నౌక..20వేల టన్నుల ఎల్పీజీతో కాండ్లా పోర్టుకు సిమి నౌక

హార్ముజ్ దాటి ఇండియాకు చేరిన మరో నౌక..20వేల టన్నుల ఎల్పీజీతో కాండ్లా పోర్టుకు సిమి నౌక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు, సరుకు రవాణా నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. అయితే భారత్ జరుపుతున్న దౌత్యపరమైన చర్చలతో ఎల్పీజీ, సరుకు రవాణా నౌకలు హార్ముజ్ గుండా సురక్షితంగా ప్రయాణించి ఇండియాను చేరుకుంటున్నాయి. తాజాగా 20వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ తో సిమీ అనే నౌక హార్ముజ్ ను సరక్షితంగా దాటి భారత్ లోని గుజరాత్ తీరం కాండ్లా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక భారత్ జరిపిన దౌత్య చర్చలతో మే 13 న హార్ముజ దాటింది.

మరోవైపు మరో రెండు సరుకు రవాణా నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని, త్వరలో భారత్ కు చేరుకుంటాయని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ధృవీకరంచింది.ఈ రెండు సరుకుల రవాణా నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమన్వయంతో వీటిని నడుపుతున్నట్లు తెలిపారు. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు.. ఇదిలా ఉంటే విదేశాంగ మంత్రి జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ తో శుక్రవారం చర్చలు జరిపారు. హార్ముజ్ గుండా తమ మిత్రదేశాల నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయని అబ్బాస్ అరాఘ్చీ హామీ ఇచ్చారు.


V6 News 5 hours ago
Home Flash News