Select Location
All Locations
State
Region
City / District
Defence Deal: హోవిజ్జ‌ర్‌, అపాచీ హెలికాప్ట‌ర్ల కొనుగోలు.. ఇండియాతో డీల్‌కు అమెరికా స‌ర్కారు క్లియ‌రెన్స్‌

Defence Deal: హోవిజ్జ‌ర్‌, అపాచీ హెలికాప్ట‌ర్ల కొనుగోలు.. ఇండియాతో డీల్‌కు అమెరికా స‌ర్కారు క్లియ‌రెన్స్‌

వాషింగ్ట‌న్: భార‌త్‌తో ర‌క్ష‌ణ ఒప్పందాని(Defence Deal)కి అమెరికా క్లియ‌రెన్స్ ఇచ్చింది. సుమారు 4 వేల కోట్ల ఖ‌రీదైన రెండు మిలిట‌రీ ఒప్పందాల‌కు అమెరికా విదేశాంగ శాఖ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా నుంచి అపాచీ, హోవిజ్జ‌ర్ విమానాల‌ను ఇండియా కొనుగోలు చేస్తుంది. అయితే ఆ మిలిట‌రీ డీల్‌కు అమెరికా స‌ర్కారు అనుమ‌తి ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది. అపాచీ హెలికాప్ట‌ర్ల స‌పోర్టు స‌ర్వీస్ కోసం సుమారు 19.8 కోట్ల డాల‌ర్లు, ఆల్ట్రా లైట్ హోవిజ్జ‌ర్ స‌పోర్టు కోసం 23 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. అపాచీ ప్యాకేజీ కాంట్రాక్టు కోసం బోయింగ్‌తో పాటు లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీలు క‌లిసి ప‌నిచేయ‌నున్నాయి. ఇంకా ఎం777 హోవిజ్జ‌ర్ల కోసం బీఏఈ సిస్ట‌మ్స్ స‌హ‌క‌రించ‌నున్న‌ది.

అపాచీ కంపెనీ త‌న క్యాకేజీలో స‌పోర్టు స‌ర్వీసెస్‌, ఇంజినీరింగ్‌, టెక్నిక‌ల్‌, లాజిస్టిక్ స‌హ‌కారం అందించ‌నున్నది. హోవిజ్జ‌ర్ల డీల్‌లో భాగంగా అన్సిల్ల‌రి ఎక్విప్మెంట్‌, స్పేర్ పార్టులు, రిపేర్, రిట‌ర్న్ సపోర్టు, శిక్ష‌ణ‌, సాంకేతిక స‌హ‌కారం అందించ‌నున్నారు. ప్ర‌తిపాదిత అమ్మ‌కాల ద్వారా భార‌త సామ‌ర్థ్యం పెరుగుతంద‌ని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొన్న‌ది. ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్ట‌ర్లు ప్ర‌పంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ మ‌ల్టీరోల్ కంబాట్ హెలికాప్ట‌ర్లు. వాటిల్లో 30ఎఎం చెయిన్ గ‌న్ ఉంటుంది. హెల్‌ఫైర్ యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు, అత్యాధునిక టార్గెట్ టెక్నాల‌జీ ఇందులో ఉంది. లాంగ్‌బో రేడార్‌, నైట్ విజ‌న్ సెన్సార్లు అపాచీలో ఉన్నాయి. భార‌తీయ ఆర్మీలోని అపాచీ ద‌ళం.. అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో, రాత్రి పూట కూడా మిష‌న్స్ చేప‌ట్టే సామ‌ర్థ్యం ఉన్న‌ది.


Smacy News 10 minutes ago
Home Flash News