నేడు (మే 21) బీసీ గురుకుల ప్రిన్సిపాల్స్తో మంత్రి పొన్నం మీటింగ్
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల ప్రిన్సిపాల్స్తో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీటింగ్ నిర్వహించనున్నారు. వచ్చే అకాడమిక్ఇయర్పై దిశానిర్దేశం చేయనున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లను సన్మానించనున్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు, పోటీ పరీక్షలకు సన్నద్ధత, బోధనా విధానాల్లో మార్పులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల పురోగతిపై రివ్యూ చేయనున్నారు. విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు, తరగతి గదుల్లో ఫర్నిచర్ తదితర అంశాలపై చర్చించనున్నారు.