Select Location
All Locations
State
Region
City / District
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విదేశాల్లో ఉద్యోగాలకోసం 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విదేశాల్లో ఉద్యోగాలకోసం 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు

జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 120 అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ అత్యాధునిక కేంద్రాల ద్వారా మెరుగైన, పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా యూరప్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు సాధించాలంటే జర్మన్ తదితర విదేశీ భాషలపై పట్టు సాధించడం ముఖ్యమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని యువతకు సూచించారు.

తన ఇటీవలి జర్మనీ పర్యటనలో వైద్య, సాంకేతిక, తయారీ రంగాల్లో నైపుణ్యవంతులకు ఉన్న భారీ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్నందున సంప్రదాయ ఉద్యోగ విధానాలు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధునిక సాంకేతికతలో పోటీపడేలా శిక్షణ తీసుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, భాషా శిక్షణపై రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులను సైతం అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ ఆదర్శ్ కుమార్ మెహ్రా, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి శిక్షణ విభాగం డైరెక్టర్ కాంతి వెస్లీ, రీజినల్ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అధికారి స్నేహాజ తదితరులు పాల్గొన్నారు.


V6 News 1 hour ago
Home Flash News