Donald Trump: పోలాండ్‌కు 5 వేల మంది సైనికుల్ని పంపుతున్న అమెరికా
వాషింగ్టన్: యూరోప్‌లో తమ బలగాలను తగ్గిస్తామని ఇన్నాళ్లూ చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పోలాండ్‌కు అదనంగా అయిదు వేల మంది బలగాలను పంపనున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు. దీంతో ఆయన చేస్తున్న ప్రకటనలపై కన్ఫ్యూజన్ నిండిపోయింది. బలగాలను తగ్గించడం కాదు.. పెంచుతున్నట్లు అర్థమవుతోంది. జర్మనీ నుంచి తమ సైనికుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. జర్మనీ నుంచి సుమారు 5 వేల మందిని ఉపసంహరించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ వార్‌లో అమెరికా పరాజయాన్ని చవిచూసినట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆరోపించారు. యుద్ధ వ్యూహాంలో అమెరికా విఫలమైనట్లు ఆయన విమర్శించారు. కానీ పోలాండ్‌కు మాత్రం అదనంగా బలగాలను పంపనున్నట్లు ట్రంప్ చెప్పడం నాటో దేశాల్లో గందరగోళం నెలకొన్నది. పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నవరోకీ విజయవంతంగా ఎన్నికయ్యారని, ఆయనకు తన మద్దతు ఉంటుందని, అమెరికా ఆయనకు మద్దతుగా 5 వేల మంది బలగాలను పోలాండ్‌కు పంపుతోందని ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో తెలిపారు.