Select Location
All Locations
State
Region
City / District
Rajyasabha Elections | జూన్‌లో రాజ్యసభ ఎన్నికలు..సీఈసీ నోటిఫికేషన్‌ విడుదల

Rajyasabha Elections | జూన్‌లో రాజ్యసభ ఎన్నికలు..సీఈసీ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లు లెక్కిస్తారు. జూన్‌1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ కాగా జూన్‌ 9న నామినేషన్ల పరిశీల ఉంటుంది.

అలాగే నామినేషన్ల విత్‌ డ్రాకు జూన్‌ 11 వరకు గడువిచ్చారు. అదేరోజు ఓట్ల లెక్కిస్తారు. జూన్‌ 20న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. కాగా, ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిద్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, సానా సతీష్‌ ల పదవీ కాలం జూన్‌ జూర్‌ 26న ముగియనుంది.ఈ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Smacy News 1 hour ago
Home Flash News