Select Location
All Locations
State
Region
City / District
Ramani Kalyanam Review: కళ్లులేని అమ్మాయి.. నడవలేని అబ్బాయి.. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గెలిచిందా?

Ramani Kalyanam Review: కళ్లులేని అమ్మాయి.. నడవలేని అబ్బాయి.. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గెలిచిందా?

కళ్లు లేని ఒక అమ్మాయి.. నడవలేని ఒక అబ్బాయి.. వీరిద్దరి మధ్య చిగురించిన అందమైన ప్రేమకథే ‘రమణి కళ్యాణం’. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా, విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ఇవాళ (మే 22, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెండితెర కళ్యాణం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

సంజన (దీప్షిక) చిన్నప్పుడే జరిగిన ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. కానీ ఆ లోపాన్ని ఎప్పుడూ తలచుకుని బాధపడదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కిషోర్ (శ్రీనివాస రెడ్డి) నడిపే పబ్‌లో సింగర్‌గా, మరోపక్క ఆర్జేగా చేస్తూ నలుగురు పిల్లలు, ఓ బామ్మతో కలిసి జీవిస్తుంటుంది. అదే పబ్‌కు కిషోర్ స్నేహితుడు, వీల్ చైర్‌కే పరిమితమైన రాజ్ (సూర్య వసిష్ఠ) వస్తుంటాడు. అనుకోకుండా సంజన, రాజ్ మధ్య గొడవ జరిగి.. అది కాస్తా పరిచయంగా మారి, చివరకు బలమైన ప్రేమగా రూపాంతరం చెందుతుంది. 

ఒకరికొకరు తోడై తమ జీవితాలను పెళ్లి పీటల దాకా తీసుకెళ్లాలని భావిస్తారు. అయితే, వీరి పెళ్లి జరిగిందా? అసలు రాజ్ వీల్ చైర్‌కే ఎందుకు పరిమితమయ్యాడు? సంజనతో ఉన్న ఆ నలుగురు పిల్లల కథేంటి? అనేదే మిగిలిన సినిమా. సినిమా విశ్లేషణ: ట్రైలర్ చూసినప్పుడే ఇదొక విభిన్నమైన ప్రేమకథ అని అర్థమైంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్‌లో సంజన, రాజ్ పాత్రలను పరిచయం చేస్తూ, వారి మధ్య ప్రేమ చిగురించే సీన్లతో క్యూట్‌గా నడిపించాడు. ఇంటర్వెల్ లో వచ్చే ఒక ఎమోషనల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వీరిద్దరి పెళ్లి చుట్టూ తిరిగే హై-ఎమోషన్స్‌తో సాగుతుంది. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. 

"ఏదో ఒక లోపం ఉందని జీవితంలో ఆగిపోకూడదు, ముందడుగు వేయాలి" అనే మంచి సందేశాన్ని ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. హీరోయిన్‌తో ఉండే నలుగురు పిల్లలు, బామ్మ బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది స్పష్టంగా చెప్పకపోవడం మైనస్. అలాగే, హీరో హెల్త్ ప్రాబ్లం రివీల్ అయ్యాక స్క్రీన్‌ప్లే కాస్త రొటీన్‌గా మారిపోవడం, క్లైమాక్స్ ఎమోషన్ పాత సినిమాలను గుర్తుచేయడం కొంత నిరాశపరుస్తుంది. అసలు ఈ కథకు 'రమణి కళ్యాణం' అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి.


V6 News 39 minutes ago
Home Flash News