Select Location
All Locations
State
Region
City / District
లింగ నిర్ధారణపై సమాచారం ఇస్తే రూ.50 వేల బహుమతి

లింగ నిర్ధారణపై సమాచారం ఇస్తే రూ.50 వేల బహుమతి

హనుమకొండ, వెలుగు: చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం అమలుపై జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారి గురించి 63000 30940 లేదా 104, 1098, 181 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందించే వారికి రూ.50 వేల ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.చందన మాట్లాడుతూ వివిధ శాఖలతో కలిసి తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో అప్పయ్య, డీడబ్ల్యూవో విశ్వజ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


V6 News 33 minutes ago
Home Flash News