ప్రభుత్వ స్కూల్ టాపర్లకు విమాన ప్రయాణం ..మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, వెలుగు: పట్టుదల ఉంటే పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అద్భుతమైన బహుమంతి ఇచ్చారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన 14 మంది విద్యార్థులను, గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చులతో విమానంలో వైజాగ్ ట్రిప్‌కు పంపించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు ఫ్లైట్ టికెట్లు అందజేసిన మంత్రి వారితో గంటన్నరకు పైగా మాట్లాడి భవిష్యత్ ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖపట్నం బయలుదేరి, రెండు రోజుల పాటు వైజాగ్, అరకు ప్రాంతాలను సందర్శించనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుతోనే పేదరికం పోతుందని, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యతను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఇవి భవిష్యత్తులో పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.