Select Location
All Locations
State
Region
City / District
దీదీ కోసం దాదా రంగంలోకి దిగారా.. యూసుఫ్ పఠాన్ను దిగిపొమ్మన్నారా..? బెంగాల్లో కొత్త వివాదం

దీదీ కోసం దాదా రంగంలోకి దిగారా.. యూసుఫ్ పఠాన్ను దిగిపొమ్మన్నారా..? బెంగాల్లో కొత్త వివాదం

బెంగాల్ ఎన్నికల తర్వాత మాజీ సీఎం మమతా బెనర్జీ సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉప ఎన్నిక ద్వారా దీదీ పార్లమెంటుకు వెళ్తుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలో మమత బెనర్జీ కోసం గంగూలీ రంగంలోకి దిగారనీ.. బహరంపూర్ ఎంపీ స్థానానికి రిజైన్ చేయాల్సిందిగా యూసుఫ్ పఠాన్ ను కోరినట్లు బెంగాల్ లో ఒక దినపత్రిక రాసుకొచ్చింది. ఈ వార్త బెంగాల్ వ్యాప్తంగా పెద్ద డిబేట్ కు కారణమైంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకునే గంగూలీ.. మమతా బెనర్జీ కోసం పనిచేశారని.. పార్టీకి అనుసంధానంగా పనిచేశారని కామెంట్స్ వచ్చాయి. ఈ వ్యవహారం విపరీత ప్రచారంలోకి రావడంతో గంగూలీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. సంచలనాల కోసం.. బాధ్యతారాహిత్యంగా.. నిజమేంటనే నిర్ధారణ లేకుండా ఇలాంటి కథనాలు రాయటం సరికాదని గంగూలీ ఫైరయ్యారు.

ముర్షీదాబాద్ జిల్లాలోని బహరంపూర్ నియోజకవర్గంపై టీఎంసీ కన్నేసినట్లు కథనంలో పేర్కొంది. అక్కడ 2024లో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదురీపై మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ గెలిచారు. అయితే అక్కడ ముస్లీం పాపులేషన్ 50–52 శాతం ఉండటంతో.. మమతకు అది సేఫ్ బెట్ గా పార్టీ భావించిందట.


V6 News 2 hours ago
Home Flash News