Select Location
All Locations
State
Region
City / District
రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం.. ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు: సిద్ధరామయ్య

రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం.. ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు: సిద్ధరామయ్య

మైసూర్: కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మైసూర్‌‌‌‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నమ్మకం లేదని, నియంతృత్వ పోకడలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, దొడ్డిదారిన బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నియంతృత్వ పాలన సాగించాలనే కుట్రతోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ విధానాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తే తమ దోపిడీ సాగదనే భయంతో బీజేపీ సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు.


V6 News 1 hour ago
Home Flash News