రేపటి నుంచే 'రైతు భరోసా'.. ఖాతాల్లోకి రూ.6,000
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్నదాతలకు వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను సిద్ధం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రైతు భరోసా’ పథకం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా, అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 6 వేల చొప్పున నగదు జమ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ (DBT) చేసేందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.