Select Location
All Locations
State
Region
City / District
సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన సేవ : సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ కృష్ణ టంకా

సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన సేవ : సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ కృష్ణ టంకా

ముషీరాబాద్, వెలుగు: సమాజానికి తిరిగి ఇవ్వడ మే నిజమైన సేవ అని.. న్యాయవాద వృత్తి ఆ సేవ ను మరింత ఎక్కువ చేసేందుకు దోహదం చేస్తుంద ని మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ కృష్ణ టంకా అన్నారు. శనివారం బాగ్‌‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో లీడర్షిప్ సింపోజియం పేరిట ‘ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ ఆన్ అడ్వకేట్ 21 సెంచరీ’ అంశంపై సదస్సు జరి గింది. దీనికి వివేక్ కృష్ణ టంకా, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ జి.వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్, కరస్పాండెంట్ జి.సరోజా వివేక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివేక్ కృష్ణ టంకా మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న కాకా వెంకటస్వామి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువునందించేందుకు గొప్ప విద్యాసంస్థను ఏర్పాటు చేశారని ప్రశంసించారు. అంబేద్కర్ లా కాలేజీ స్టూడెంట్లను భావిభారత నాయకులుగా తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఫెయిల్యూర్లకు కుంగిపోకుండా వాటి నుంచి పాఠా లు నేర్చుకొని జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. మీరు సక్సెస్​ఫుల్​లాయర్​ అయితే దేశ ప్రధానులు, రాష్ట్రాల సీఎంలు కూడీ మీతో తరచూ మాట్లాడతారని చెప్పారు. మంచి లాయర్‌‌‌‌గా కొనసాగాలంటే నిబద్ధతతో కష్టపడాలన్నారు. అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లకు పార్లమెంట్, సుప్రీంకోర్టు సందర్శనలో తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


V6 News 5 hours ago
Home Flash News