8 జట్లు, 4 మ్యాచ్‌లు.. క్వార్టర్ ఫైనల్ షెడ్యూల్ రిలీజ్.. కప్ కొట్టేదెవరు?
FIFA Quarter Finals: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగియడంతో, టోర్నమెంట్ అత్యంత కీలకమైన చివరి దశకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టాప్-8 జట్లు (క్వార్టర్ ఫైనలిస్ట్‌లు) తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఫుట్‌బాల్ దిగ్గజాలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు ఈసారి ఊహించని రీతిలో మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లాయి. దీంతో నాలుగు బ్లాక్‌బస్టర్ నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేచింది.