Select Location
All Locations
State
Region
City / District
Vijay: 'జన నాయగన్' రిలీజ్‌పై విజయ్ ఫుల్ ఫోకస్.. టికెట్ రేట్లపై కఠిన నిర్ణయం!

Vijay: 'జన నాయగన్' రిలీజ్‌పై విజయ్ ఫుల్ ఫోకస్.. టికెట్ రేట్లపై కఠిన నిర్ణయం!

తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ( Jana Nayagan ) పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వివాదాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఆ సమస్యలను దాటుకుని త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులపైనే కాదు.. విడుదల సమయంలో ఎలాంటి వివాదాలు లేకుండా జరగాలన్న దానిపై విజయ్ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఈ హెచ్ వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. 'జన నాయకన్' విడుదల సమయంలో టికెట్ ధరలు అధికంగా వసూలు చేయడం, బ్లాక్ టికెట్ల విక్రయం, బెనిఫిట్ షోల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేయడం వంటి ఘటనలు అస్సలు జరగకూడదని విజయ్ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


V6 News 1 hour ago
Home Flash News