Select Location
All Locations
State
Region
City / District
OTT Review: ఓటీటీలో ఉత్కంఠ రేపే హోమ్లీ థ్రిల్లర్.. ట్విస్టులతో దుమ్మురేపుతున్న‘పరిమళ్ అండ్ కో’

OTT Review: ఓటీటీలో ఉత్కంఠ రేపే హోమ్లీ థ్రిల్లర్.. ట్విస్టులతో దుమ్మురేపుతున్న‘పరిమళ్ అండ్ కో’

తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'పరిమళ్ అండ్ కో'. సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవన విధానాన్ని చూపిస్తూనే, వారి జీవితాల్లోకి అనుకోకుండా వచ్చే ఒక పెద్ద ముప్పు ఎలాంటి మలుపులు తిప్పింది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హోమ్లీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5)లో స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. జీ5 యాప్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ (250M+ Streaming Minutes) సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

పరిమళ్ (జయరామ్)కు ఇద్దరు కూతుళ్లు. జాలరిపేటకు చెందిన రౌడీ వర్గీస్ (శాండీ) రాజకీయ అండతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటాడు. ఎదిరించిన వారిని అంతమొందించడానికి కూడా వెనుకాడని వర్గీస్, పరిమళ్ చిన్న కూతురు మధుమిత (అనంతిక)ను ప్రేమ పేరుతో వేధిస్తుంటాడు. అతని తల్లి కూడా కొడుకుకే అండగా నిలుస్తుంది. ఈ విషయం పరిమళ్​ పెద్ద కూతురు పరాశక్తి (సంజనా కృష్ణమూర్తి) తన ప్రియుడు చిట్టీ (సంతోష్ శోభన్)తో చెప్తుంది. ఆ మరుసటి రోజే వర్గీస్ దారుణంగా హత్యకు గురవుతాడు. చనిపోయే ముందు పరిమళ్ కుటుంబంతో జరిగిన గొడవ వెలుగులోకి రావడంతో అనుమానాలన్నీ వారి ఇంటివైపే మళ్లుతాయి. ఒకవైపు ప్రతీకారంతో రగిలిపోతున్న వర్గీస్ తల్లి, మరోవైపు పోలీసులు.. ఈ రెండు ముప్పుల మధ్య పరిమళ్ కుటుంబం బయటపడిందా? లేదా? అసలు వర్గీస్​ను చంపిందెవరు? అనేదే

సినిమా ప్రారంభం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ వాతావరణం, అక్కాచెల్లెళ్ల అనుబంధంతో ఆహ్లాదకరంగా మొదలవుతుంది. అయితే, విలన్ వర్గీస్ (శాండీ) ఎంట్రీతో కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. ఫస్టాఫ్ విలన్ పెట్టే వేధింపులు, దానికి కుటుంబం పడే ఆవేదనను దర్శకుడు బాగా చూపించారు. వర్గీస్ హత్యకు గురయ్యే వరకు కథనంలో ఉత్కంఠ (సస్పెన్స్) బాగానే మెయింటైన్ అయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ పై కథపై ఆసక్తిని పెంచుతుంది.


V6 News 10 hours ago
Home Flash News