Dharmendra Pradhan: రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ఏం రాశారంటే
Dharmendra Pradhan: తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపినట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజుల నుంచి జరిగిన పరిణామాలు తనను దుఖ్కానికి గురి చేశాయన్నారు. భారత యువశక్తియే ఈ దేశానికి అసలైన శక్తి అని ఆ లేఖలో పేర్కొన్నారు
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఎక్స్‌లో పోస్టు చేశారు. దాంట్లో ఏం రాశారంటే.. గత 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను తనను బాధకు గురిచేసినట్లు మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు చెందిన విషయం కాదు అని అన్నారు. భారత యువశక్తియే ఈ దేశానికి అసలైన శక్తి అని అన్నారు. దేశ యువశక్తిని భ్రమలో పడకుండా చూస్తానన్నారు. ఇదే తన సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు.
జంతర్ మంతర్ కానీ, ఇతర ప్రదేశాల్లో జరిగిన సంఘటనలతో దేశ విరోధ శక్తులు బలపడకుండా చూడాలన్నారు. దేశం ఐక్యతతో నిలవాలన్నారు. భారత విద్యార్థుల భవిష్యత్తు దేశ చట్టాలకు బంధీ కావొద్దన్నారు. మన పిల్లలు తమ మనసును చదువులపై పెట్టాలని, కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని, ఈ విషయంపై ఆలోచనలు చేసి, తన రాజీనామాను ప్రధాని మోదీకి సమర్పించినట్లు మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు.
ప్రభు జగన్నాథుడి ఆశీస్సులతో భవిష్యుత్తులో దేశమాత కోసం సేవ చేస్తానన్నారు. ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీదకు నాకు నమ్మకం ఉందని, యువత ఆకాంక్షలు, ఆశయాలను గౌరవిస్తున్నానన్నారు. యువత కేవలం భారత దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వాళ్లు వికసిత భారత్‌కు కొత్త వాహకాలు అన్నారు. భవిష్యత్ నిర్మాతలు, శిల్పకారులు అని కూడా యువతే అని పేర్కొన్నారు.
మే 3వ తేదీన జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తెలియనే.
ఆ కేసును సీబీఐకి అప్పగించామన్నారు. ఆ ఎగ్జామ్‌ను మల్లీ షెడ్యూల్ చేశామన్నారు. 2027 నుంచి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన్ తెలిపారు. సుమారు 20 లక్షల మంది రాసిన నీట్ పరీక్షను స్మూత్‌గా నిర్వహించడమే ప్రాధాన్యతగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం దీనికి సహకరించిందన్నారు. విద్యార్థులు, గార్డియన్లు, పేరెంట్స్ సహకారంతో పరీక్షను జూన్ 21వ తేదీన విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాన్ తెలిపారు.
ముందు నుంచి ఈ సంక్షోభానికి బాధ్యతను ఆమోదిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాధ్యతల నుంచి తానేమీ పారిపోయేందుకు ప్రయత్నించలేదన్నారు. ఎగ్జామ్ మాఫియా వల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నానన్నారు. ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండ చూశానన్నారు. జూలై 16వ తేదీన రిలీజ్ చేసిన నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎంతో మంది మెరిట్ పేద విద్యార్థులు విజయం సాధించినట్లు చెప్పారు. తన లేఖలో కేంద్ర మంత్రులకు, అధికారులకు, విద్యాశాఖ సిబ్బందికి, తనతో పనిచేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేయడమే తన జీవితంలో అత్యధిక ప్రాధాన్యమైందని, దేశ సేవకే అంకితమైనట్లు ఆయన తన లేఖలో చెప్పారు. ప్రధాని మోదీకి రాసిన రాజీనామా లేఖను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.