Select Location
All Locations
State
Region
City / District
టేకాఫ్‌కు ఉత్తరాంధ్ర సిద్ధం.. మోదీజీ మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం: చంద్రబాబు

టేకాఫ్‌కు ఉత్తరాంధ్ర సిద్ధం.. మోదీజీ మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం: చంద్రబాబు

అమరావతి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘రేపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నాం. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి’’ అని తెలిపారు. ప్రధాని పోస్ట్‌ను సీఎం చంద్రబాబు (Chandrababu) షేర్‌ చేశారు. ‘‘ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. మోదీజీ.. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని.. పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.


Eenadu Telugu 1 hour ago
Home Flash News