గ్రాండ్ చెస్ టూర్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ డ్రా
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న సింక్‌ఫీల్డ్ కప్ తొలి గేమ్‌ను ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ శామ్యూల్ సెవియన్‌తో జరిగిన ఈ గే మ్‌ను ప్రజ్ఞా 48 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. నల్ల పావులతో ఆడిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆరంభం నుంచి ఎలాంటి పొరపాట్లు చేయలేదు. రుయ్ లోపెన్ ఓపెనింగ్‌లోని అర్ఖంగెల్స్ స్ట్రాటజీతో ముందుకెళ్లాడు.
సెవిలియన్ కూడా ఎలాంటి క్లిష్టమైన ఎత్తులకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆడాడు. టాప్‌సీడ్ ఫ్యాబియానో కరువాన (అమెరికా).. జోర్డెన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్)తో జరిగిన గేమ్‌లో 55 ఎత్తుల వద్ద విజయం సాధించాడు. ఇక జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్).. లెవోన్ అరోనియన్ (అమెరికా), విన్సెంట్ కీమర్ (జర్మనీ).. వెస్లీ సో (అమెరికా), అనిష్ గిరి (నెదర్లాండ్స్).. మాక్సిమ్ వాచియర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి.