Select Location
All Locations
State
Region
City / District
YSR ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతం: సీఎం రేవంత్

YSR ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతం: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం (సెప్టెంబర్ 2) డాక్టర్ వైఎస్సార్-డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. 

భారతీయ వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఈ అవార్డును అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బతికున్నన్ని రోజులు రైతుల కోసం పరితపించిన డాక్టర్ వైఎస్సార్‌ను మనమంతా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వైఎస్సార్ ఆశయమైన ప్రాణహిత, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.


V6 News 1 hour ago
Home Flash News