Vijay: ఎవరికీ తలవంచం: విజయ్
ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఒంటరిగానే విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Actor Vijay) పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లో జరిగేది ఎన్నికల పోరు కాదని.. ప్రజాస్వామ్య యుద్ధమన్నారు. మహాబలిపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే (TVK) పార్టీకి ‘విజిల్’ గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ‘తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే విజయం సాధిస్తాం.
అందుకు తగ్గ సైన్యం మావద్ద ఉంది. ఇది ఎన్నికల పోరు కాదు.. ప్రజాస్వామ్య యుద్ధం. అన్నాడీఎంకే ప్రత్యక్షంగా.. డీఎంకే పరోక్షంగా భాజపాకి సరెండర్ అయ్యాయి. టీవీకే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గదు. డీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చింది.ఎవరికీ తలవంచం.. దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు. మనమందరం కలిసికట్టుగా ఉంటే విజయం మనదే. రాష్ట్రంలో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైంది’ అని విజయ్ అన్నారు. దుష్ట శక్తులను, అవినీతిపరులను ఎదుర్కొనే ధైర్యం తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు.