PCB: ఐసీసీ హెచ్చరికలు.. టీ20 ప్రపంచకప్‌నకు జట్టును ప్రకటించిన పాక్
ఇంటర్నెట్ డెస్క్: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టును ఐసీసీ (ICC) తప్పించిన నేపథ్యంలో.. పాక్ కూడా అదే బాటలో నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో పీసీబీ (PCB) వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పొట్టి ప్రపంచకప్ కోసం 15 మందితో జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పీసీబీ జట్టును ప్రకటించింది. బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదీలు జట్టులోకి తిరిగి రాగా.. హారిస్ రౌఫ్‌ను పక్కన పెట్టారు.