AP cabinet: లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ
అమరావతి: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తితిదే లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించారు. దీనిపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ వేసిన విషయాన్ని అధికారులు చెప్పారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత.. దానిపై స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు.