Team India: సింహాద్రి అప్పన్న సేవలో టీమ్‌ఇండియా క్రికెటర్లు
విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని టీమ్‌ఇండియా (TeamIndia) క్రికెటర్లు సందర్శించారు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్‌గంభీర్ బుధవారం అప్పన్నను దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దర్శన అనంతరం క్రికెటర్లకు అర్చకులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. విశాఖలో నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 జరగనుంది.