మహాపాపం చేసి కూడా బుకాయించుకోవడం జగన్‌కే చెల్లింది: మంత్రి లోకేశ్
అమరావతి: తిరుమల లడ్డూ విషయంలో మహాపాపం చేసి కూడా బుకాయించుకోవడం వైకాపా అధినేత జగన్‌కే చెల్లిందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. కల్తీ జరిగిందని నిర్ధరణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘పాలే లేని కల్తీ నెయ్యి సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరం. వందల కోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వైకాపా కుట్రలను దీటుగా తిప్పికొట్టడంతోపాటు వారి వ్యవహారాన్ని ప్రజల్లోనే ఎండగడదాం’’ అని లోకేశ్ అన్నారు.