... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇరాన్పై మేం కూడా యుద్ధం చేస్తం..! బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్

ఇరాన్పై మేం కూడా యుద్ధం చేస్తం..! బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్

అమెరికా సైనిక స్థావరాల నుంచి బ్రిటన్​ దాడులు

ఖతార్ ​వైపు దూసుకెళ్తున్న ఇరాన్ డ్రోన్ ​కూల్చివేత

లండన్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం ఇజ్రాయెల్, ఇరాన్​ దేశాలకే పరిమితమయ్యేలా కనిపించడం లేదు. గ్లోబల్ పవర్ హౌస్​లుగా పిలవబడే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నేరుగా రంగంలోకి దిగడంతో పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్ ప్రతీకార దాడులను అడ్డుకునేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని ఈ మూడు దేశాలు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఒక వీడియో సందేశం ద్వారా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు తమ దేశ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవాలని అమెరికా కోరగా.. దానికి బ్రిటన్ పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా, ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఒక ఇరాన్ డ్రోన్​ను బ్రిటన్​కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ టైఫూన్ ఫైటర్ జెట్ కూల్చివేయడం ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చింది.

శనివారం నాటి దాడుల తర్వాత బ్రిటన్ నేరుగా యుద్ధంలో పాలుపంచుకోవడం ఇదే తొలిసారి. అలాగే, ఇరాన్ చేస్తున్న విచక్షణారహిత క్షిపణి దాడులను సహించేది లేదని ఈ యూరోపియన్ దేశాల నేతలు స్పష్టం చేశారు. కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా.. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని ఇరాన్ ను హెచ్చరించారు. ఇది ఇరాన్​కు డైరెక్ట్ వార్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు.

Source : Smacy News

1 hour ago

Home Flash News