... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
మోడల్ సోలార్ విలేజ్ పనులకు డెడ్లైన్ మార్చి 31.. డొమెస్టిక్ రూఫ్ టాప్స్, పంప్ సెట్లకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ స్పీడప్

మోడల్ సోలార్ విలేజ్ పనులకు డెడ్లైన్ మార్చి 31.. డొమెస్టిక్ రూఫ్ టాప్స్, పంప్ సెట్లకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ స్పీడప్

ఇప్పటివరకు 45 శాతం పనులు పూర్తి

రాష్ట్రంలో పైలట్​ ప్రాజెక్టుగా 80 గ్రామాలు ఎంపిక

హనుమకొండ, వెలుగు: సోలార్ రూఫ్‌‌ టాప్స్ ద్వారా విద్యుత్ వినియోగదారులు, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంటితో పాటు వ్యవసాయ పంప్‌‌సెట్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా, మిగులు విద్యుత్‌‌ను ప్రభుత్వానికి విక్రయించేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 80 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’ పేరుతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. గత ఏడాది ప్రారంభమైన పనులు కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుండటంతో ప్రభుత్వం మార్చి 31లోగా అన్ని ఇన్‌‌స్టాలేషన్ పనులు పూర్తి చేయాలని గడువు

వంద శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్..

గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్​ ముఫ్త్​ బిజిలి యోజన ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎంపికైన గ్రామాల్లో ప్రతి ఇంటిపై దాదాపు రూ.1.38 లక్షల వ్యయంతో 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఖర్చులో రూ.60 వేలు కేంద్రం, రూ.78 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఈ పనులను తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్​ఈడీసీవో), డిస్కంల ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. వ్యవసాయ పంప్‌‌సెట్లకు 7.5 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

పైలట్ ప్రాజెక్ట్‌‌లో 80 గ్రామాలు..

మోడల్ సోలార్ విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 80 గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్​పీడీసీఎల్​) పరిధిలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని 22 గ్రామాలు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని పలు గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎస్​పీడీసీఎల్​) పరిధిలో కొడంగల్ మండలంలోని 34 గ్రామాలతో పాటు మరో 9 గ్రామాలు ఎంపికయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్​కర్నూల్​ జిల్లా కొండారెడ్డిపల్లిలో వంద శాతం పనులు పూర్తయ్యాయి.

Source : Smacy News

1 hour ago

Home Flash News