గల్ఫ్ బాధితుల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్
నిజామాబాద్, వెలుగు: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న జిల్లా బాధితుల సహాయార్థం పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సోమవారం మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వ్యక్తుల క్షేమ సమాచారాన్ని జిల్లాలోని వారి కుటుంబీకులు తమ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
తెలంగాణ గవర్నమెంట్ఢిల్లీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సమన్వయం చేసుకొని తమ ఆఫీస్ పనిచేస్తుందన్నారు. ఇందుకోసం 8712659700, 8712659821 నంబర్లను సంప్రదించాలని సూచించారు.