భారత్‌లో చిక్కుకుపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ (ICC Mens T20 World Cup) 2026 నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే వారు భారత్‌ను కాస్త ఆలస్యంగా వీడనున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అంతరాయమే దీనికి కారణం. ఆటగాళ్ల ప్రయాణ భద్రత కోసం తాము ఐసీసీ (ICC), సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరాన్ ప్రతిదాడి వల్ల దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
‘గల్ఫ్ ప్రాంతంలో సైనిక చర్య వల్ల ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో అనేక అంతర్జాతీయ విమాన మార్గాలు ప్రభావితమయ్యాయి. భద్రత కారణాల దృష్ట్యా విమాన సంస్థలు ముందుగా షెడ్యూలు చేసిన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
వెస్టిండీస్‌తో పాటు, జింబాబ్వే జట్టు కూడా ఈ కారణంగానే భారత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ జట్టు దిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘మా క్రికెట్ జట్టు దుబాయ్ ద్వారా స్వదేశానికి తిరిగి రావాల్సిఉంది. కానీ మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి కారణంగా ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమయ్యాయి’ అని జింబాబ్వే క్రికెట్ బోర్డ్ ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో తెలిపింది.