... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
యశ్‌ ‘టాక్సిక్‌’ వాయిదా.. కారణమిదే..

యశ్‌ ‘టాక్సిక్‌’ వాయిదా.. కారణమిదే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: యశ్‌ (Yash) హీరోగా రానున్న తాజా సినిమా ‘టాక్సిక్‌’ (Toxic Movie). గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ‘ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌’ అనేది ఉప శీర్షిక. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్ట్‌ పెట్టింది. మొదట ఈ మూవీని మార్చి 19న విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దీన్ని జూన్‌ 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

‘మేం ఈ ‘టాక్సిక్‌’ను అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌లోనూ రిలీజ్‌ చేయాలి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదు. అందుకే వాయిదా వేస్తున్నాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇక ఇందులో యశ్‌తో పాటు అయిదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ఎలిజిబెత్‌గా, నయనతార (Nayanthara) గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్‌ ఆకట్టుకోనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Source : Smacy News

1 hour ago

Home Flash News