... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Pawan Kalyan: పవర్‌స్టార్ పవనిజం.. ఉగాదికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సందడి..!

Pawan Kalyan: పవర్‌స్టార్ పవనిజం.. ఉగాదికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సందడి..!

Ustaad Bhagat Singh Release Date Out: పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.

Ustaad Bhagat Singh Release Date Out: పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఉగాది పండగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ పవన్‌ కల్యాణ్‌ పవర్‌ఫుల్ లుక్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. పవన్ కల్యాణ్ పొలిటికల్ బిజీలో ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం కృషి చేస్తోంది.

Source : Smacy News

1 hour ago

Home Flash News