INDvENG: టీమిండియాను దెబ్బ కొట్టేందుకు ఇంగ్లండ్ పెద్ద ప్లానింగ్తో ఉందిగా..!
టోర్నీ ఆరంభంలోనే వెస్టిండీస్ చేతిలో ఓడినా ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకొని సెమీస్ చేరుకుంది. ముఖ్యంగా సూపర్–8 రౌండ్‌లో ఆ టీమ్ గొప్ప విజయాలు అందుకుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రధానంగా కెప్టెన్ హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, సామ్ కరన్ వ్యక్తిగత పెర్ఫామెన్స్‌పై ఆధారపడింది. జట్టు డీలా పడ్డ ప్రతీసారి ఎవరో ఒకరు ఆదుకున్నారు. మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్ కోల్పోయి సతమతమవుతుండటం ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. బుమ్రా బౌలింగ్‌లో బట్లర్ రికార్డు (88 బాల్స్‌లో 79 రన్స్, 4 సార్లు ఔట్) ఆశాజనకంగా లేదు. ఈ కీలక మ్యాచ్‌లో బట్లర్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడా లేదా అనేది చూడాలి. బౌలింగ్‌లో ఇంగ్లిష్ టీమ్ బలంగా ఉంది. ముఖ్యంగా షార్ట్ బాల్స్‌తో ఇబ్బంది పట్టే జోఫ్రా ఆర్చర్ నుంచి ఆతిథ్య బ్యాటర్లకు ముప్పు ఉంది.
గతంలో శాంసన్‌ను మూడు సార్లు ఔట్ చేసిన ఆర్చర్‌పై అభిషేక్ శర్మ, తిలక్ వర్మ పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇక, ఇండియా ఓపెనర్లను కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్‌ను ప్రయోగించే చాన్స్ ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. మిడిల్ ఓవర్లలో లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎదుర్కోవడం ఇండియాకు పెద్ద సవాలు.
ఇంగ్లండ్ డ్యాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఎంత త్వరగా కట్టడి చేస్తే ఇండియాకు అంత మంచిది. గతంలో సాల్ట్‌ను నాలుగు సార్లు ఔట్ చేసిన అర్ష్‌దీప్ మళ్లీ ఆ పని చేయాలి. న్యూజిలాండ్‌పై అదరగొట్టిన యంగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను పక్కనపెట్టి సీనియర్ పేసర్ జేమీ ఓవర్టన్ను ఇంగ్లండ్ తుది జట్టులోకి తీసుకురానుంది.