... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Virat Kohli: డెన్లోకి ఎంట్రీ ఇచ్చిన కింగ్.. కోహ్లీ రాకతో ఆర్సీబీ క్యాంప్‌లో జోష్

Virat Kohli: డెన్లోకి ఎంట్రీ ఇచ్చిన కింగ్.. కోహ్లీ రాకతో ఆర్సీబీ క్యాంప్‌లో జోష్

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలిశాడు. మార్చి 28వ తేదీన ప్రారంభమయ్యే ఈ టోర్నీలో టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆర్సీబీ సిద్ధమవుతోంది. కాగా గత సీజన్ లో ఆర్సీబీ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అతను 657 పరుగులు చేసి, 144.71 స్ట్రైక్ రేట్‌తో పాటు 54.75 సగటుతో అద్భుత ప్రదర్శన చేశాడు. 8 అర్ధ సెంచరీలతో జట్టుకి ట్రోఫీ దక్కేలా చేశాడు. ఈసారి కూడా అదే ఫామ్ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.

విరాట్ కోహ్లీ రాకను ఆర్సీబీ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోని షేర్ చేసింది. విమానాశ్రయంలో నుంచి కారు ప్రయాణం వరకు ఈ వీడియోలో అతని జెర్సీ నంబర్ 18కు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ కడూఆ కోహ్లీ రాకపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “కింగ్ తన రాజ్యంలోకి వచ్చాడు”, “మళ్లీ సింహాసనం అధిరోహించేందుకు సిద్ధమయ్యాడు” అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. అతను 267 మ్యాచ్‌లలో 8,661 పరుగులు చేసి, 8 సెంచరీలు, 63 అర్ధశతకాలు ఉన్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీ తరఫుననే ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఎం. చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. అనంతరం ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ తో, ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ తో గువాహటిలో, ఏప్రిల్ 12న ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడనుంది.

Source : V6 News

1 hour ago

Home Flash News