... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
AP High Court on Alla RK Case : గత ప్రభుత్వ హయాంలో కేసులు.. సీఎం చంద్రబాబుకి భారీ ఊరట.. 3 పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

AP High Court on Alla RK Case : గత ప్రభుత్వ హయాంలో కేసులు.. సీఎం చంద్రబాబుకి భారీ ఊరట.. 3 పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

AP High Court on Alla RK Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంలో చంద్రబాబు నాయుడికి న్యాయపరంగా భారీ ఊరట లభించినట్లైంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వ్యవహారానికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని విన్నవించడంతో పాటు.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని.. అలానే ఈ కేసును ఏసీబీ కోర్టు విచారిస్తుండగా.. దాన్ని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

తాజాగా వీటిని విచారించిన ఏపీ హైకోర్టు.. ఈ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వాటిని కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు అనుకూలమైన వారి భూముల గుండా మార్చారంటూ గత ప్రభుత్వం హయాంలో ఈ కేసు నమోదైంది. దీనిపై సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతోంది. తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఈ మూడు పిటిషన్ల వ్యవహారానికి తెరపడింది. రాజకీయంగానూ, న్యాయపరంగానూ ఈ తీర్పు చంద్రబాబుకు సానుకూల అంశంగా మారింది.ఆంధ్రప్రదేశ్ పర్యాటకం

Source : Ntv

1 hour ago

Home Flash News