... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని అధికారులు సీజ్ చేశారు.

హైదరాబాద్, మార్చి 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన ఇల్లు సీజ్ అయింది. హైదరాబాద్‌లో ఉన్న ఆమె ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆమె ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే ఆస్తిపన్ను బకాయిలపై నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించివారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న జీ+4 భవనాన్ని సీజ్‌ చేశారు. ఈ ఇంటికి సంబంధించి 2017 నుంచి సుమారు రూ.83 లక్షల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని సమాచారం.

నిన్న(సోమవారం) జీహెచ్‌ఎంసీ ఏఎంసీ బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది జయలలిత ఇంటిని సీజ్‌ చేశారు. మార్చి 31 వరకు ఓటీఎస్‌ స్కీమ్‌ అందుబాటులో ఉందని, ఆ రాయితీ పోగా మొత్తం రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జయలలితకు సంబంధించిన ఈ భవనంలో గతంలో ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే ఈ భవనాన్ని 2017 నుంచి నివాసానికి వాడుకుంటున్నామని.. కాబట్టి రెసిడెన్షియల్‌గా మార్పాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్‌ జయకుమార్‌ గతంలో కోరారు.

Source : Ntv

1 hour ago

Home Flash News