ఇరాన్ సంచలన నిర్ణయం: అమెరికా-ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ.. ఈ దేశాల నౌకలకి మాత్రమే ఎంట్రీ..!
హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ తీసుకున్న కొత్త నిర్ణయాలు, దాని వల్ల తలెత్తిన ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకం (Toll Tax) వసూలు చేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయించింది.
దింతో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఆంక్షలు విధించిన దేశాల నౌకలను ఈ దారిలో వెళ్లనివ్వకూడదని ఇరాన్ నిర్ణయించింది. కేవలం భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ వంటి మిత్ర దేశాల నౌకలను మాత్రమే ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. గతంలో ఒక్కో నౌకకు సుమారు 18 కోట్ల రూపాయల (2 మిలియన్ డాలర్లు) వరకు వసూలు చేయాలని ఆలోచన ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం చమురు (Oil), గ్యాస్ వ్యాపారంలో ఐదో వంతు (20%) వాటా ఈ చిన్న జలమార్గం ద్వారానే సాగుతుంది. గల్ఫ్ దేశాల నుండి చమురు బయటి ప్రపంచానికి వెళ్లాలంటే ఇది అతి ముఖ్యమైన దారి. ఈ దారి మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో మొదలైన ఈ గొడవ ఇప్పటికి 32వ రోజులు అంటే నెల రోజులు దాటింది. ఇరు దేశాల దాడుల వల్ల ఇప్పటివరకు సుమారు 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు సరఫరాపై పెద్ద ప్రభావం చూపేలా కనిపిస్తోంది.