... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’

‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’

సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్‌ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్‌ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. 

తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?
..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?.

Source : Sakshi

1 hour ago

Home Flash News