Select Location
All Locations
State
Region
City / District
CPI Narayana | తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేసినా ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదు : కె.నారాయణ

CPI Narayana | తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేసినా ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదు : కె.నారాయణ

హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్‌ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని పేర్కొన్నారు. నాడు జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు  అలాంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీనికాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కూటమి గెలుపు ఖాయమన్నారు.


Smacy News 1 hour ago
Home Flash News