Select Location
All Locations
State
Region
City / District
పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు

పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు

సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే.

పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ సైలెంట్‌గా ఉండిపోయారు. పవన్‌ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్‌ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. 

ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా. అయితే.. 

మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ భావోద్వేగం ఈ నిర్ణయం వెలువడ్డాక వర్మ పిఠాపురం టీడీపీ ఆఫీస్‌కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా’’ అంటూ మాట్లాడారాయన.


Sakshi 54 minutes ago
Home Flash News