Select Location
All Locations
State
Region
City / District
కేసీఆర్ అర్థరాత్రి ఆలోచనల వల్లే రాష్ట్రం అప్పుల పాలు.. మేఘా కృష్ణారెడ్డి ప్రపంచ స్థాయికి!: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ అర్థరాత్రి ఆలోచనల వల్లే రాష్ట్రం అప్పుల పాలు.. మేఘా కృష్ణారెడ్డి ప్రపంచ స్థాయికి!: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ అర్థరాత్రి ఆలోచనల వల్లే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్ముడిహెట్టి వద్ద గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టు స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి , ఎమ్మెల్యే వినోద్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను తుగ్లక్ సీఎంగా వర్ణిస్తూ.. ఆయన తీసుకున్న . కేవలం కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి, కాళేశ్వరాన్ని నిర్మించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఒక చిన్న కాంట్రాక్టర్ అయిన మేఘా కృష్ణారెడ్డి ప్రపంచ స్థాయికి ఎదిగారని విమర్శలు గుప్పించారు.

ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు ఎలాంటి నష్టం లేదని.. అక్కడి సీఎం ఫడ్నవీస్ దీనికి సహకరించాలని కోరారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేలా చొరవ తీసుకోవాలని.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని వివేక్ స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.


V6 News 53 minutes ago
Home Flash News