Select Location
All Locations
State
Region
City / District
గ్రీన్ హైడ్రోజన్ వేవ్: లక్ష కోట్ల బిజినెస్ వెనుక 3 సీక్రెట్ స్టాక్స్! మీరూ కొన్నారా?

గ్రీన్ హైడ్రోజన్ వేవ్: లక్ష కోట్ల బిజినెస్ వెనుక 3 సీక్రెట్ స్టాక్స్! మీరూ కొన్నారా?

భారత ఇంధన రంగంలో ఇప్పుడు ఒక కొత్త విప్లవం మొదలైంది. అదే గ్రీన్ హైడ్రోజన్. పర్యావరణానికి మేలు చేస్తూనే.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి దీనికి ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.19వేల 744 కోట్ల భారీ కేటాయింపులతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లకు ఇది ఒక లక్ష కోట్ల రూపాయల వ్యాపార అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ పాలసీ వేవ్ కారణంగా దూసుకుపోయే స్టాక్స్ ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గ్లోబల్ ఈపీసీ దిగ్గజమైన స్టెర్లింగ్ అండ్ విల్సన్.. ఇప్పుడు తన దృష్టిని గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లించింది. ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద బలం రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో రిలయన్స్‌కు 40% వాటా ఉంది. రిలయన్స్ సొంతంగా 3 మిలియన్ టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకోవడంతో ఆ ప్రాజెక్టులన్నీ SWREL చేతికే వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇన్వెస్టర్ల చూపు స్టెర్లింగ్ అండ్ విల్సన్ పైన పడింది.

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కీలకమైన పరికరం ఎలక్ట్రోలైజర్. ఈ రంగంలో అద్వైత్ ఎనర్జీ ఒక స్పెషలిస్ట్‌గా ఎదుగుతోంది. గుజరాత్‌లో సొంతంగా ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2027 నాటికి 300 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కింద 95% స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత.

హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు అయితే.. దానిని స్టోర్ చేయడం, ట్రాన్స్‌పోర్ట్ చేయడం మరో ఎత్తు. హైడ్రోజన్ వాయువును ద్రవ రూపంలో మార్చాలంటే -253°C అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీలో ఐనాక్స్ ఇండియా తిరుగులేని కంపెనీగా ఉంది. ISROకు లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంకులను సరఫరా చేసిన అనుభవం ఐనాక్స్ ఇండియా సొంతం.

ఈ మూడు కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో బలమైన పునాదులు కలిగి ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా ఇవి మంచి పనితీరును కలిగి ఉన్నాయి. అయితే వీటి షేర్లు ప్రస్తుతం మార్కెట్ సగటు కంటే కాస్త ఎక్కువ ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. దీర్ఘకాలికంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో రాణించాలనుకునే ఇన్వెస్టర్లు పరిశీలించదగిన స్టాక్స్ జాబితాలో ఈ మూడు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


V6 News 45 minutes ago
Home Flash News